కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించండి..

126
harishrao
- Advertisement -

కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ వనస్థలిపురం లో ఉన్న ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 100 పడకలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు..కరోన సెకండ్ వేవ్ సందర్భముగా నగరంలో అదనపు పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కారోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధముగా 1400 పడకలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయమన్నారని..నిలోఫర్ లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

మరో 6 ఆసుపత్రిలో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన హరీష్ రావు..అందులో భాగంగా వనస్థలిపురం లో 100 పడకలు ఏర్పటు చేసుకున్నాం అన్నారు. అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ,ప్రభుత్వానికి సహకరించాలన్నారు. 24 లక్షలు హోమ్ ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచుకున్నాం అన్నారు.పేదల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్నా రాష్ట్రము తెలంగాణ అని కేంద్రం ప్రకటన చేసిందన్నారు.

పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ఇచ్చారని…ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషలాటి ఆసుపత్రి రానుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. మన బస్తి ధవాఖానాలు దేశానికి ఆదర్శం అని….నగరం లో ఎక్కడ ఇంకా ఎక్కువ అవసరం ఉన్న ప్రాంతంలో మరిన్ని బస్తి దవాఖాన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించామని అదేశాలు ఇచ్చారన్నారు. మున్సిపాలిటీలో కూడా బస్తి దవాఖాన్ లో ప్రారంభించనున్నాం అన్నారు.

- Advertisement -