రెమ్యునరేషన్ తగ్గించుకోండి..నానికి అనిల్ సూచన

29
anil

సినిమా యాక్టర్ నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మాకు ఏ నానీలు తెలియదు తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒకడేనని కౌంటరిచ్చారు. సినిమా లో జరిగే దోపిడీ ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రొడక్షన్ కి 30 శాతం ఖర్చు అయితే సినిమా హీరోల రెమ్యునరేషన్ ఖర్చు 70 శాతం ఉంటుందన్నారు.

సినిమా హీరోలు వాళ్ల రెమ్యునిరేషన్ తగ్గించు కోవచ్చు కదా అని సూచించిన అనిల్…ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అని ప్రశ్నించారు.