డయాలసిస్ కిట్‌ల పెంపుకు కృషి: హరీష్ రావు

77
harishrao
- Advertisement -

రాష్ట్రంలో డయాలసిస్‌ కిట్‌ల పెంపుకు కృషిచేస్తానని తెలిపారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల ఆస్పత్రి నూతన అంతస్తును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు…కరోన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో రహేజా కార్ప్ ముందుకు వచ్చిందన్నారు. 100 పడకల ఫ్లోర్ ని ఈరోజు ప్రారంభించుకున్నాం… కోవిడ్ సమయంలో హైదరాబాద్ లో 1300 పడకలను అదనంగా సీఎస్ ఐఆర్ లో భాగంగా వివిధ సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామన్నారు.

33 జిల్లాల్లో 6000 పడకలతో చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ విభాగాలు అందుబాటులోకి వచ్చాయన్నారు .ప్రభుత్వం మూడో వేవ్ ప్రణాళికతో సిద్దంగా ఉంది… ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయన్నారు. రు. 154 కోట్లతో 900 లకు పైగా ఐసీయూ బెడ్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. కేసీఆర్ కిట్ వచ్చాక 52% డెలివరీ లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయన్నారు. కొండాపూర్ లో అతి త్వరలో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తాం అన్నారు.

కార్పొరేటర్ లు తమ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అందేలా చూడాలి. రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి ఆరా తీయాలన్నారు. వ్యాక్సినేషన్ 100% జరగాలంటే ప్రజా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అన్నారు. 3.96 లక్షల వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ చేశాం..రోజు సుమారు 3.5 నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ లు ఇస్తున్నామన్నారు. మైండ్ స్పేస్ సీఈఓ కి అభినందనలు…ఆస్పత్రి మెయింటెనెన్స్ కూడా మైండ్ స్పేస్ కూడా తీసుకోవాలని కోరుతున్నామన్నారు.

- Advertisement -