బిగ్ బాస్ 5 తెలుగు…ఎపిసోడ్ 94 హైలైట్స్

49
bb5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 94 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 94వ ఎపిసోడ్‌ ఫన్నీగా సాగగా రోల్ రిక్రియేషన్ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఇరగదీసేశారు. ప్రేక్షకులకు నచ్చిన ఐకానిక్ సంఘటనల్ని ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్‌కి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా సన్నీలా సిరి.. షణ్ముఖ్‌లా సన్నీ.. కాజల్‌లా శ్రీరామ్.. ఆనీ మాస్టర్‌లా మానస్.. రవిలా కాజల్.. వారి వారి పాత్రలో పెర్ఫామెన్స్ ఇరగదీశారు.

అయితే సన్నీ షణ్ముఖ్ పాత్రని చేస్తూ.. సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‌ని నలిపిపడేశాడు.. మాటి మాటికి హగ్ చేసుకుంటూ రారా అంటూ హగ్‌లతో షణ్ముఖ్‌ని నలిపేసి.. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ షణ్ముఖ్-సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేసి మెప్పించారు. అతని యాక్షన్‌కి ఎలా రియాక్ట్ కావాలో తెలియక.. షణ్ముఖ్, సిరిలు అలూ చూస్తు ఉండిపోయారు.

సన్నీ హద్దుదాటడంతో.. షణ్ముఖ్ వచ్చి.. ఇదే వేరే విధంగా వెళ్తుంది.. నువ్ బాగా ఓవర్ చేస్తున్నావ్ అని మండిపడటంతో సన్నీ కూల్ అయ్యాడు. టాస్క్ అయిపోయిన తరువాత.. సన్నీ దగ్గరకు వచ్చిన షణ్ముఖ్.. నువ్ చాలా వెకిలి చేష్టలు చేశావ్.. ఇమిటేట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు అంటూ చెప్పాడు. నేను కామెడీగానే చేశాను.. క్యారెక్టర్‌లో ఉన్నాను.. కాజల్‌ని కూడా తిట్టాను కదా నెక్ట్స్ టైం ఇలా చేయను అని హగ్ చేసుకున్నాడు. పక్కనే ఉన్న సిరి వదిలేయండి అని షన్ను-సిరికి సర్దిచెప్పింది. అయితే సిరి దగ్గర తన బాధను చెబుతూ గట్టిగా అరిచాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్‌లో సిరి- సన్నీ మధ్య జరిగిన గొడవ ఎంతదూరం వెళ్తుందో వేచిచూడాలి.