ఈటలకు మంత్రి హరీష్ రావు సవాల్‌.. వీడియో

20

ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఈరోజు హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని వడ్డెర సంఘం సమావేశంలో మంత్రి హరీష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తా.. అదే 291 రూపాయల ట్యాక్స్ ఉన్నదని రుజువు చేయకపోతే ఎన్నికల నుండి తప్పుకుంటావా… రాజేందర్? అని మంత్రి హరీష్‌ రావు సవాల్‌ చేశారు. రేపు రావాలా.. ఇవాల రావాలా.. జమ్మికుంటకా… హుజూరాబాద్ కా.. అంటు ఈటల రాజేందర్‌కు మంత్రి హరీశ్ రావు సవాల్‌ విసిరారు.