బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ- మంత్రి కొప్పుల

17

దళితబంధు వంటి పథకం ప్రపంచంలోనే మరొకటి లేదు. దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఈ పథకం సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో సోమవారం దళిత బంధుపై వస్తున్న అనుమానాలపై అవగాహన కార్యక్రమంలో మంత్రి కొప్పుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో కాలంగా అన్ని రంగాలలో బాగా వెనుకబడి ఉన్న దళిత సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు.

దళిత బంధుపై ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలొద్దు, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దు. ముఖ్యమంత్రి ఒక్కొక్క రంగాన్ని, ఒక్కొక్క వర్గానికి మేలు చేస్తూ ముందుకు సాగుతున్నారు,అందులో భాగంగానే ఇప్పుడు మన దళిత సమాజం గురించి ఈ పథకాన్ని స్వరంగా రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పథకానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ ఏర్పాటు కాగానే ఏయే వర్గాన్ని ఎలా ఉన్నతిలోకి తీసుకు రావాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేశారు. ఈ విషయమై మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్లు ఘంటా చక్రపాణి మల్లేష్,లింబాద్రీ వంటి మేధావులతో చర్చించారని మంత్రి తెలిపారు.

ఇప్పుడు మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలవుతుంది, తర్వాత రాష్ట్రం అంతటా అమలు చేయడం జరుగుతుంది. ఒకసారి ఖాతాలో 10 లక్షలు పడిన తర్వాత ముఖ్యమంత్రి కూడా వాపస్ తీసుకోవడం సాధ్యం కాదు, బ్యాంకు ఖాతా తీసుకోవాలంటే 2 వేలు కట్టాలి కాని ఆ భారం దళితులపై వేయకుండా కేసీఆర్ రే భరించిండు అని అన్నారు. బిజెపి పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ, దేశాన్ని పాలించేది ఆ పార్టీయే కాదా వారు కూడా ఇతర రాష్ట్రాలలో అమలు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. బిజెపి వాళ్లు కొందరు యువకులను పంపి దళితబంధు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

బిజెపి పార్టీ దళితులకు ఎలాంటి సహాయం చేయక పోగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో దళితులు లేరా, తెలంగాణ దళితులపై ముసలి కన్నిల్లు కార్చే బిజెపి పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇస్తున్న 10 లక్షల దళిత బంధుకు మరో 10 లక్షలు కలిపి ఇస్తే మా దళితుల అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది అన్నారు. కాని దేశంలో బిజెపి ప్రభుత్వం మంచి పని చేయలేదా అంటే చేసింది,వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచినది, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15లక్షల చొప్పున వేస్తానని ప్రధాని మోడీ చెప్పి మోసం చేసిన విషయాన్ని మరువొద్దు అని మంత్రి ఎద్దేవ చేశారు.

అలాగే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తనన్నడు,కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా, ఉన్నవాటినే విడదీసింది అని మంత్రి అన్నారు. అందుకే కారు గుర్తుకు ఓటేసి, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఘన విజయం చేకూర్చండి, కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వండి అని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, సర్పంచ్ సుజాత కిషన్ రెడ్డి, జడ్పీటిసి వనజ సాదవరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకిషన్ రావు, ఎంపిటిసి రంజిత పుల్లారెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణ‌ పాల్గొన్నారు.