ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో గెలిచిన 11 మంది రాజీనామా..

21

ప్రకాష్ రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త‌న ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది స‌భ్యులు రాజీనామా చేస్తున్న‌ట్టు ఆయన ప్ర‌క‌టించారు. ‘మా’ ఎన్నిక‌ల అనంత‌రం ఇవాళ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో ప్ర‌కాష్ రాజ్ మాట్లాడుతూ.. స‌మాస‌ అసోసియేష‌న్ లో మంచు విష్ణు ప‌నుల‌కు అడ్డు రాకూడ‌ద‌నే తాను రాజీనామా చేశాన‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు. మీకు కావాల్సిన వాళ్ల‌ను పెట్టుకుని ఉచితంగా మా సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని మంచు విష్ణు టీంకు ప్ర‌కాష్ రాజ్‌ సూచించారు. విష్ణు రెండేళ్లు బాగా ప‌నిచేయాల‌ని సూచించారు.

‘మా’ మంచి కోసం తామంతా ముందుకొచ్చామ‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు. ‘మా’ ఎన్నిక‌ల్లో రౌడీయిజం బాగా పెరిగిపోయింది. పోస్ట‌ల్ బ్యాలెట్ల నుంచే అది మొద‌లైంది. ఎక్క‌డెక్క‌డి నుంచో మ‌నుషుల్ని తీసుకొచ్చారు. బెన‌ర్జీపై చేయి చేసుకుని అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. గెలిచిన వాళ్ల‌ను ఓడిపోయార‌ని మ‌రుస‌టి రోజు ప్ర‌క‌టించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మీరు, మేము క‌లిసి ప‌నిచేయ‌గ‌ల‌మా..? అని ప్ర‌శ్నించారు. గ‌తంలో స‌గం, స‌గం ప్యానెల్‌తో క‌లిసి ప‌నిచేయ‌లేక‌పోయారు. అందుకే మా ప్యానల్‌ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం’ అని ప్రకాష్ రాజ్‌ ప్రకటించారు.