తెలంగాణ దేశానికే ఆదర్శంః మంత్రి హరీష్ రావు

461
Harish Rao
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గొనేపల్లి గ్రామంలో 30 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు . కాస్త ఆలస్యమైన నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు చెందాయి. రూపాయి ఖర్చు లేకుండా హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్ మాదిరి ఇండ్లు నిర్మించి ఇచ్చాం.

మీరు గృహ ప్రవేశం చేయడం వల్ల కెసిఆర్ కల నెరవేరింది. ప్లాస్టిక్, చెత్తాచెదారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అమ్మినా, కొన్నా కేసులు నమోదు చేస్తాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచి నీరు, రైతులకు24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు గుర్తు చేశారు.

రాజకీయ నాయకులు గొప్ప సేవకులు అన్నారు. ప్రజాప్రతినిధులలో కొందరు రాత్రింబవళ్ళు సేవా చేసే వారుంటారు. కొంత మంది సమాజంలో గౌరవం కోసమే సేవ చేస్తారు. చనిపోయే చివరి శ్వాస వరకు సేవా చేసే నాయకులు ఉంటారు. ఈ గ్రామంలో22 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు తోడ్పాటు ఇస్తే ఇంకా మేము ఎక్కువ పని చేస్తామని తెలిపారు.

- Advertisement -