కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో వైద్య పరికరాల తయారీ కంపెనీలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. 3 – MRI,11- CT స్కాన్ మిషన్ల, 3- కార్డియాక్ కేథ్లాబ్ లు కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు సిద్దం చేసిన నేపథ్యంలో సాంకేతిక విషయాలు, మైంటేనేన్స్, ధరల విషయాలు మంత్రి ఈటెల చర్చించారు.
ప్రభుత్వం తరపున ప్రజలకు సౌకర్యాలు పెంచాలి అనే ప్రయత్నం చేస్తున్నాము. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సకు పేద ప్రజలు సైతం 30 నుండి 40 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. వారికి భారం లేకుండా వైద్యం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో పని చేస్తున్నాం. కాబట్టి కంపెనీల వారు కూడా సహకరించాలని.. మంచి మిషన్లు తక్కువ ధరకు అందించాలి మంత్రి కోరారు. పెద్ద పెద్ద మిషన్లు కొనుగోలు చేయడం కంటే, ఎక్కువ మందికి ఉపయోగ పడే మిషన్లు కొనుగోలు చేయడం మంచిదన్నారు మంత్రి.