ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి: మంత్రి ఈటెల

280
Minister Etela Rajender Review On Lockdown
- Advertisement -

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.
లాక్ డౌన్ సడలింపుల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున బయటికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరం అన్నారు మంత్రి ఈటల. వాక్సిన్ వచ్చేంతవరకు కరోనా వైరస్‌తో సహజీవనం తప్పదు కాబట్టి జాగ్రతలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రజలందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బయటికి వస్తున్న వారు తప్పకుండా మాస్క్ ధరించాలి,భౌతిక దూరం పాటించాలని,తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి అని కోరారు. ఇంట్లో చిన్న పిల్లలు,వృద్దులు ఉన్న వారు మరింత జాగ్రత్త గా ఉండాలని సూచించారు. దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని కోరారు.

వలస కార్మికుల, విదేశీ ప్రయాణీకులు, ఇతర రాష్ట్రాలు నుండి వస్తున్న వారికి మరియు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ముందు వరుసలో ఉండి పని చేస్తున్న వైద్య , మున్సిపల్, పోలీసు సిబ్బందికి వ్యాధి లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించాలని నిన్న ఐసీఎంఆర్‌ మార్గనిర్దేశకాలు విడుదల చేసింది. కాబట్టి వాటిని తప్పకుండా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి కోరారు.

Minister Etela Rajender Review On Lockdown

గతంలో చెప్పిన మాదిరిగానే బయటి నుండి వస్తున్న వారిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటిన్ చేయాలని మరోసారి ఆదేశించారు.గ్రామాల్లో జ్వర పరీక్షలపై మంత్రి ఆరా తీశారు.ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం వహించవద్దని కోరారు. అన్నీ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందిచేల చూడాలని సూచించారు. కొవిడ్‌ (లక్షణాలు ఉన్నవారిని), నాన్ కోవిద్ పేషంట్లను విడివిడిగా చూడాలని కోరారు.

గాంధీ ఆసుపత్రిలో పేషంట్ల చికిత్స పై కూడా మంత్రి సమీక్షించారు. గాంధీ ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఫోన్‌లో మాట్లాడారు. కోమార్బిడ్ కండిషన్ ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ రోజు ఎలాంటి కండిషన్ లోనున్న పలువురు డిశ్చార్జ్ చేయడం పట్ల వైద్య బృందానికి అభినందనలు తెలిపారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వరకు వాటిల్లోనున్న మందుల స్టాక్‌పై మంత్రి ఈటల సమీక్షించారు. అన్నీ ఆసుపత్రుల్లో సరిపోయేంత స్థాయిలో మందులు ఉండేలా చూడాలని ఎండీ కి చెప్పారు. కరోనా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నాయి కాబట్టి అన్ని హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ సదుపాయం ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ఎంత చేసిన ప్రజల భాగస్వామ్యం తోనే కరోనా కట్టడి సాధ్యం కాబట్టి అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇస్తున్న గైడ్ లైన్స్‌ను తూచా తప్పకుండా పాటించాలని మంత్రి ఈటెట కోరారు.

- Advertisement -