గాంధీ జయంతి రోజున గాంధీ ఆస్పత్రి వద్ద విగ్రహం ఏర్పాటు: హరీశ్‌

54
- Advertisement -

గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద ఏర్పాటు చేయనున్న మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని అక్టోబ‌ర్ 2వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రిస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నేప‌థ్యంలో గాంధీ విగ్ర‌హాన్ని మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, డీఎంఈ ర‌మేశ్ రెడ్డి, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్, గాంధీ సూప‌రింటెండెంట్ రాజారావు ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద 16 ఫీట్ల ఎత్తులో గాంధీ విగ్ర‌హం ఏర్పాటు చేస్తుండ‌టం సంతోషంగా ఉంద‌న్నారు. కొవిడ్ స‌మ‌యంలో గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు అత్య‌ద్భుత సేవ‌లందించారు. అక్టోబ‌ర్ 2న ఉద‌యం 10 గంట‌ల‌కు గాంధీ విగ్ర‌హాన్ని కేసీఆర్ ఆవిష్క‌రించ‌నున్నార‌ని తెలిపారు. అనంతరం ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసే బ‌హిరంగ స‌భ‌లో సీఎం ప్ర‌సంగించ‌నున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -