పేదలకు ఫ్రీగా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం..

252
minister etela
- Advertisement -

నిమ్స్ హాస్పిటల్‌ను తెలంగాణలోనే ఉన్నత హాస్పిటల్‌గా తీర్చిదద్దడంలో ముందున్నామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. న‌గ‌రంలోని నిమ్స్‌లో స్టెమ్ సెల్స్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్య రోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. డిల్లీలో మాత్రమే ఉన్న మలిక్యూలార్ ల్యాబ్‌ను ఇక్కడ ప్రారంభించాం.స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడే వాళ్ళ కోసం ఈ ల్యాబ్‌ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్నతమైన ల్యాబ్ ను తెలంగాణలో ఏర్పాటు చేశాం. రక్త క్యాన్సర్‌తో బాధపడే వాళ్లకు ఇక్కడ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా సర్వీస్ అందించవచ్చు. తెలంగాణలో వున్న అన్ని హాస్పిటల్‌లో ఉన్నత వసతులు నిమ్స్ కు ఉన్నాయన్నారు మంత్రి ఈటెల.

కోవిడ్ తక్కువ అవుతున్న నేపధ్యంలో త్వరలో అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఐసీఎంఆర్ చెప్పిన అన్ని గైడ్ లైన్స్ ఫాల్లో అవున్నామన్నారు. గతంలో వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉండేవో కరోనాతో కూడా అలానే ఉంది. తెలంగాణలో ప్రతి గడపలో టెస్టుల చేస్తున్నాం. నిమ్స్‌లో ఓపి పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదగా ఇక్కడ ఒపి బ్లాక్ నిర్మాణానికి శంకుస్తాపన చేస్తాం. అలాగే నిమ్స్ కెపిసిటీని మరింత పెంచుతామని.. పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వారికి ట్రీట్మెంట్ ఉచితంగా అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

- Advertisement -