దేశంలోనే నెంబర్‌ 1గా తెలంగాణ: మంత్రి జగదీశ్ రెడ్డి

85
Minister Jagadish Reddy

తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన జగదీశ్ రెడ్డి…డంపింగ్ యార్డ్ లను కూడా అందంగా, సుందరంగా , సుందరికరణ చేసుకున్నాం….
సీఎం కేసీఆర్ ఉద్యమ కాలంలో రచించిన ప్రణాళికలు లను, ఆలోచనలను అన్నిటిని ఒక్కటిగా అమలు చేస్తూ తెలంగాణాను నందన వనంల ,సుబ్బిక్షంగా మార్చారని తెలిపారు.

ప్రజలు కోరుకున్న దానికంటే మిన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ను తీర్చిదిద్దారు….KTR గారు ఎన్నో ప్రపంచ దేశాల్లో తిరిగి,ఉన్నత చదువులు చదివి , ఎంతో అపార అనుభవంతో మున్సిపల్ శాఖను, పట్టణాల రూపురేఖలు లను పూర్తిగా మార్చారని తెలిపారు.పట్టణ ప్రగతితో పట్టణాలు అందంగా తయారయ్యాయి…..అన్ని వర్గాల ప్రజల యోగ క్షేమలు,అవసరాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రపంచంలోనే పారిశ్రామిక వేత్తలకు ,పెట్టుబడులకు స్వర్గధామంలా మారింది తెలంగాణ..దాని ఘనత అంత మంత్రి KTR దే……నేడు తెలంగాణ పెరు ప్రపంచం మొత్తం మారుమ్రోగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి,గొంగిడి సునీత,గాదరి కిషోర్,చిరుమర్తి లింగయ్య,సైదిరెడ్డి,ఎమ్మెల్సీ కృష్ణానెడ్డి,డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర రెడ్డి,కలెక్టర్ అనిత రాంచంద్రన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.