- Advertisement -
ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ (తెలంగాణ భవన్) కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి పరిశీలించారు. వీరితో పాటు రైతుబంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ నిర్మాణంలో మార్పులు చేర్పులపై పలు సూచనలు చేశారు ఎర్రబెల్లి. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం గట్టమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేశారు.
- Advertisement -