ప్రగతి విద్యాసంస్థల ఛైర్మన్‌కు ఎర్రబెల్లి పరామర్శ..

144
dayakar
- Advertisement -

ఇటీవ‌ల మృతి చెందిన పాల‌కుర్తి ప్ర‌గ‌తి విద్యా సంస్థ‌ల అధినేత‌, వీర‌మనేని వెంక‌టేశ్వ‌ర‌రావు త‌ల్లిగారు శ్రీ‌మ‌తి తార‌మ్మ గారి ద‌శ‌దిన క‌ర్మ‌కు హాజ‌రైన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు. ఈ సంద‌ర్భంగా మంత్రి తార‌మ్మ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకున్నారు. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు త‌మ సంతాపాన్ని, ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంద‌ర్భంగా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు మంత్రితోపాటు ఉన్నారు.

- Advertisement -