ఆర్జీవీ …’ఇది మహాభారతం కాదు’

60
rgv

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవర్సీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. ఇది మహాభారతం కాదు అంటూనే దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

మహాభారతంలోని పాత్రలను ప్రస్తావిస్తూ.. తన వాయిస్ ఓవర్‌తో రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ఆడియో పోస్టర్ వీడియో ఆసక్తికరంగా ఉండటం గమనార్హం. మహాభారతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని, తెలంగాణలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని, దీని ఆధారంగా తాము వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నామని వర్మ ఆ ఆడియో పోస్టర్ లో వెల్లడించారు.. దీనికి రచన సిరాశ్రీ కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Idhi Mahabharatam Kaadhu I Audio Poster I A Web Series from Ram Gopal Varma I A Spark OTT Production