గొప్ప యోధురాలు…చాకలి ఐలమ్మ:మంత్రి ఎర్రబెల్లి

195
errabelli

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు,నిజాం పాలన కాలంలో విస్నూరు దేశ్‌ ముఖ్‌కి వ్యతిరేకంగా పోరాటలు నడిపింది వీరనారి చాకలి ఐలమ్మ. ఇవాళ ఆమె వర్దంతి సందర్భంగా పలువురు చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు.

చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి….. ఆనాటి ఉద్యమమే మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందని తెలిపారు. చాకలి ఐలమ్మ తన నియోజకవర్గ ప్రాంతంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందని పేర్కొన్నారు.దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అన్నారు.