ఎన్టీఆర్ 30లో సంజయ్ దత్..!

148
ntr

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.

ఎన్టీఆర్ కెరీర్‌లో మరచిపోని చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు త్రివిక్రమ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీ రోల్ పోషించేలా ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నారట. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట.

హారిక హాసిని బ్యానర్ తో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. గ్యాప్స్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడట త్రివిక్రమ్.