సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి..

30
kcr

ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.135.59 కోట్లు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.452.82 కోట్లు కేటాయించగా.. అనంతరం రూ. 823.14 కోట్లు అదనంగా కేటాయించారు. మొత్తం రూ.1,275.96 కోట్లలో ఇదివరలోనే రూ.1,140.36 కోట్లు విడుదల చేయగా మిగిలిన రూ.135.59 కోట్లను తాజాగా విడుదల చేశారు. ఈ నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ కి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

ఈ నిధుల విడుదలతో… రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి లభించడమే గాక, అభివృద్ధి పనులు ఆగకుండా సాగుతాయని మంత్రి తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రూ.800 కోట్లు కూడా వస్తె, అభివృద్ధి అద్భుతంగా కొనసాగుతుందని మంత్రి అభిప్రాయ పడ్డారు. ఇప్పటికే ఉపాధి హామీలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉన్న విషయం తెలిసిందే.