విక్రమ్ ‘కోబ్రా’ టీజర్ అదిరింది‌..

32
Chiyaan Vikram

తమిళ హీరో చియాన్ విక్రమ్ తాజాగా నటిస్తున్న చిత్రం ”కోబ్రా”. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో విక్రమ్ తనదైన శైలిలో విభిన్న గెటప్స్లో కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో శనివారం ‘కోబ్రా’ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘కోబ్రా’ టీజర్ చూస్తుంటే ఇదొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇందులో విక్రమ్ ఓ జీనియస్ మ్యాథమెటిషియన్ గా కనిపిస్తూ ప్రతీ ప్రాబ్లమ్ కి మ్యాథమాటికల్ సొల్యూషన్ ఉంటుందని పేర్కొంటున్నాడు. ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్‌, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ టీజర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం తన మార్కును తెలియజేస్తోంది.

Cobra - Official Teaser | Chiyaan Vikram | AR Rahman | R Ajay Gnanamuthu | 7 Screen Studio