తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి- మంత్రి పువ్వాడ

392
minister ajay kumar
- Advertisement -

బుధవారం ఖమ్మం జిల్లాలో వరి ధాన్యం, మక్కల తరలింపు, నిల్వలు ఉంచేందుకు గోదాముల ఏర్పాటుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ,ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , కందాళ ఉపేందర్ రెడ్జి,రాములు నాయక్ హాజరైయ్యారు. అలాగే వారితో పాటు ఈ సమీక్షలో మార్కెటింగ్, వ్యవసాయం, రవాణా, మార్కుఫెడ్, వెర్ హౌసింగ్, సివిల్ సప్లై, సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం,మక్కలు కొనుగోలు మరియు నిల్వలు, కొన్న ధాన్యంకు సరిపడు గోదాములపై మంత్రి ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం, మిగిలి ఉన్న ధాన్యం గోదాములకు తరలించండి అని అధికారులను ఆదేశించారు.

గన్ని బ్యాగ్స్ కొరత, ఎక్కడెక్కడ అవసరం ఉందో నివేదిక ఇవ్వండి. ధాన్యం నిల్వల కోసం ఫంక్షన్ హాళ్లు, స్కూళ్లు వాడుకోవాలన్నారు. అకాల వర్షల వల్ల తడిసిన ధాన్యంను కూడా కొనుగోలు చేయాలి. రైతులకు ధైర్యం చెప్పండి అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను కోరారు.

- Advertisement -