అద్భుతాలను ప్రపంచానికి చూపించండి: కిషన్‌ రెడ్డికి చిరు విషెస్

24
chiru

కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యూపీఏ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన చిరు…కిషన్‌ రెడ్డికి విషెస్ చెబుతూ సలహా ఇచ్చారు.

దేశాన్ని సమగ్రంగా పర్యటించడానికి ఇది ఆయనకు దక్కిన గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ఇలాగే కృషి చేస్తూ.. మన భారతీయ చరిత్రాత్మక సంపదను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలని …ఇది ఒక మంచి అనుభం మాత్రమే కాదు.. తనకు దక్కిన గొప్ప గౌరవం అని స్పష్టం చేశారు.

విస్తరణకు ముందు మోదీ మంత్రి మండలిలో 53 మంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 77కి చేరింది.