తలైవా రజనీ ఈజ్ బ్యాక్‌..

1001
rajinikanth

హెల్త్ చెకప్‌ కోసం అమెరికా వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్వదేశానికి తిరిగివచ్చారు. అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయంలో ఆయన కనిపించడంతో అక్కడే ఉన్న ఆయన అభిమానులు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తలైవా రిటర్న్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందులో రజినీ నీలం రంగు చొక్కా, డెనిమ్ జీన్స్ టోపీ, వైట్ షూజ్ ధరించి కన్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం తలైవా తన భారీ ప్రాజెక్ట్ “అన్నాత్తే” షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. రజనీ కూతురు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

జూన్ 19న తలైవా తన భార్యామణితో కలిసి చెన్నై నుంచి అమెరికాకు పయనమైన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడాలోని మాయో క్లినిక్ వైద్య కేంద్రంలో ఆయన ఉన్న పిక్స్ బయటకొచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే.