గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మేయర్ గుండు సుధారాణి..

43
Mayor Gundu Sudharani

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు గ్రేటర్ వరంగల్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు మేయర్ గుండు సుధారాణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తానని, పచ్చదనం పెంచి వరంగల్ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కోసం కృషి చేస్తానని తెలియజేశారు. దీనికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, ప్రజలు అధికారులు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.