18న నెట్‌ఫ్లిక్స్‌లో ధనుష్‌ ‘జగమే తంతిరం’..

161
Dhanush
- Advertisement -

ఎప్పటినుంచో ప్రేక్ష‌కులు అందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రం ‘జగమే తంతిరం’ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ రోజు (జూన్‌ 1) విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రకిట రకిట పాటకు శ్రోతల నుంచి అత్యద్భుతమైన స్పందన లభించింది. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్‌కి కూడా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ‘జగమే తంతిరం’ చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించారు. ఈ చిత్రంలో తమిళ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో ధనుష్‌ అదరగొట్టారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, వై నాట్‌ స్టూడియోస్‌ నిర్మించిన ‘జగమే తంతిరం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

‘జగమే తంతిరం’ చిత్రంలో ధనుష్, ఐశ్వర్యలక్ష్మీ, జోజు జార్జ్, కలైయారసన్, శరత్‌ రవి, జేమ్స్‌ కాస్మో ప్రధాన పాత్రలు పోషించారు. ‘జగమే తంతిరం’ చిత్రంలో వీరి నటన వీక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇక ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ అందించిన సంగీతం మరో ఆకర్షణ అని చెప్పొచ్చు. కథ, కథనాలు, సంగీతం ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. చూపు తిప్పుకోలేని రితీలో ఈ సినిమా వీక్షకులను అలరించ‌నుంది. 208 మిలియన్ల వ్యూయర్స్‌ ఉన్న నెట్‌ఫ్లిక్స్‌లో ‘జగమే తంతిరం’ ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 18న ప్రసారం కానుంది. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కార్తిక్‌ సుబ్బరాజు మాట్లాడుతూ – “జగమేతంతిరం’ సినిమా నా డ్రీమ్‌ ఫిల్మ్‌. ఈ సినిమా కథనం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. ఓ స్థానిక ప్రాంతానికి చెందిన సాధార‌ణ వ్యక్తి అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? ఇందుకు దారి తీసిని ప‌రిస్థితులేంటి? అన్నదే ఈ చిత్రం మూల కథాంశం. ఇక న‌ట‌నలో ధనుష్‌ ప్రతిభ గురించి ప్రత్యేకించి మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో కూడా ధనుష్‌ స్టైల్‌ ఆఫ్‌ ఎంటర్ టైన్‌మెంట్‌ గ్యారంటీగా ఆడియన్స్‌ను అలరిస్తుంది. 190 దేశాల్లో నెటిఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం వ్యూయర్స్‌ వీక్షించగలరు. వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది’’అని అన్నారు.

తారాగణం: ధనుష్, జేమ్స్‌ కాస్మో, ఐశ్వర్యా లక్ష్మీ, జోసెఫ్‌ జోజు జార్జ్, కలైయారసన్, శరత్‌ రవి, రోమన్‌ ఫియోరీ, సుందరరాజ, దురై రామచంద్రన్, మాస్టర్‌ అశ్వత్‌
సాంకేతిక నిపుణులు
రచయిత-దర్శకుడు: కార్తిక్‌ సుబ్బరాజ్‌
సంగీతం: సంతోష్‌ శివన్‌
డీఓపీ: శ్రేయాస్‌ కృష్ణ
ఎడిటర్‌: వివేక్‌ హర్షన్‌

నెట్‌ఫ్లిక్స్‌ గురించి..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడింగ్‌ ఓటీటీ సంస్థల జాబితాలో ముందువరుసలో ఉన్న స్ట్రీమింగ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్‌. 190 దేశాల్లో 208 మిలియన్ల పెయిడ్‌ మెంబర్‌షిప్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. డాక్యూమెంటరీలు, టీవీ సిరీస్‌లు, ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఇలా భిన్నరకాలైన వినోదాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తమ వ్యూయర్స్‌కు అందిస్తుంది. ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై ఉన్న ఓ స్క్రీన్‌పై అయిన…ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసులను పొందవచ్చు. వ్యూయర్స్‌ తమ సౌకర్యానికి వీలుగా ‘ప్లే, పాజ్, రీ ప్లే, ఫార్వర్డ్, బ్యాక్‌వార్డ్‌’ ఆఫ్షన్లు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

వై నాట్‌ స్టూడియో గురించి..
చెన్నైలో ఉన్న ప్రముఖ నిర్మాణసంస్థ వై నాట్‌ స్టూడియోస్‌. 2009లో శశికాంత్‌ ఈ నిర్మాణసంస్థను ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ సంస్థ నుంచి 18 ఫీల్మ్‌ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విక్రమ్‌ వేదా సినిమాను నిర్మించింది వై నాట్‌ స్టూడియోనే. ఈ చిత్రానికి పుష్కర్‌ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు పలు భాషల్లో రీమేక్‌కు సిద్ధమవుతుంది. ఇక వై నాట్‌ స్టూడియో నుంచి వచ్చిన చివరి చిత్రం యోగిబాబు నటించిన మండేలా. పొలిటికల్‌ సెటైర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ తమిళ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్‌ నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ నిర్మాణసంస్థ నుంచి ధనుష్‌ నటించిన ‘జగమే తంతిరం’ సినిమా రానుంది. జూన్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ గురించి..

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది రిల‌య‌న్స్‌ గ్రూప్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ మీడియా విభాగానికి చెందినది. సినిమాలు, టెలివిజన్, డిస్ట్రిబ్యూటన్, డిజిటల్, గేమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వంటి విభాగాల్లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌ మెంట్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కార్యకాలాపాలను నిర్వహిస్తుంది. అలాగే ఐకానిక్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పిల్‌బర్గ్‌తో డ్రీమ్‌ వర్క్స్‌తో 2009 నుంచి రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూప్‌ అసోసియేట్‌ అయ్యింది. ఈ అసోసియేషన్‌లో ఎన్నో మంచి, విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ‘ది హెల్ప్, వార్‌ హౌస్, లింకోన్, ది హాండ్రెడ్‌ ఫూట్‌ జర్నీ, ది గళ్‌ ఆన్‌ ది ట్రైన్, ఏ డాగ్స్‌ పర్‌పస్, బ్రిడ్జ్‌ ఆఫ్ స్ప‌యిస్‌, ది పోస్ట్‌ వంటి చిత్రాలు వచ్చాయి. ఇక 2019 గోల్డెన్‌ గ్లోబ్, ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌. గ్రీన్‌ బుక్‌ అండ్‌ 2020 అకాడమీ అవార్డు నామినీ అండ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ విన్నర్ 1917మూవీని కూడా ఈ సంస్థ నిర్మించింది.

- Advertisement -