రఘునందన్ అభ్యర్ధిత్వాన్ని రద్దుచేయాలి:కాంగ్రెస్

51
marri shashidhar reddy

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అభ్యర్ధిత్వాన్ని రద్దుచేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది కాంగ్రెస్‌. బీజేపీ అభ్యర్థి సంబంధించి రెండుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడ్డారని లేఖలో పేర్కొన్నారు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి.

అన్ని పార్టీల నాయకుల వాహనాలను తనిఖీ చేయాలని..మద్యం,బార్లు మూసివేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు శశిధర్ రెడ్డి. పోలింగ్ ముందు రోజు దుబ్బాకలోని చాలా గ్రామాల్లో భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా బీజేపీ నగదు, మద్యం పంపిణీ చేస్తున్నదని ఆయన ఆరోపించారు.