నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో గ్రీన్ ఛాలెంజ్..

215
gic
- Advertisement -

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను అదనపు కలెక్టర్లు, శిక్షణ కలెక్టర్ డిఆర్ఓ స్వీకరించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. వారు మరో 14 మంది అధికారులకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.అదనపు కలెక్టర్ మను చౌదరి,జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సుధాకర్ నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.

శిక్షణ సహాయ కలెక్టర్ చిత్రామిశ్రా అచ్చంపేట్, కల్వకుర్తి కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్లకు మొక్కలు నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట్, కొల్లాపూర్, డివిజన్ల నలుగురు ఆర్డీవోలకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.డీఆర్​వో మధుసూదన్ నాయక్​ నాగర్ కర్నూల్ కల్వకుర్తి అచ్చంపేట్ కొల్లాపూర్ నలుగురు తహశీల్దార్లకు గ్రీన్ ఛాలెంజ్​ విసిరారు.అనంతరం అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ శనివారం జిల్లా కలెక్టర్ శర్మన్, విసిరిన గ్రీన్ చాలెంజ్ లో భాగంగా చాలెంజ్ ను స్వీకరిస్తూ….నేడు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందన్నారు.

నలుగురం కలిసి మరో 14 మంది అధికారులకు గ్రీన్ చాలెంజ్ విసరడం జరిగిందని, హరితహారం తో పాటు గ్రీన్ ఛాలెంజ్ ద్వారా నిర్వహించే చైన్ సిస్టం నిరంతరం ఇదే విధంగా కొనసాగితే జిల్లాలో అత్యధికంగా మొక్కలు నాటేందుకు దోహద పడుతుందన్నారు.గ్రీన్ ఛాలెంజ్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకొని, ప్రతి ఒక్కరు స్వీకరించి ఇదే విధానాన్ని నిరంతరం కొనసాగించి జిల్లాను హరిత జిల్లాగా మార్చేందుకు గ్రీన్ ఛాలెంజ్ దోహదపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖంగా కొనసాగుతున్న ఒక మంచి కార్యక్రమమని, ఆయన ఈ సందర్భంగా అన్నారు.

- Advertisement -