మా ఎన్నికలపై మంచు విష్ణు సంచలన కామెంట్స్‌..

126
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబర్‌ 10న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్‌ సభ్యులను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టిస్ట్‌ల కోసం, మా అందరి కోసం ‘మా’ ఉంది. ‌మా ప్రెసిడెంట్‌ అనేది ఒక బిరుదు కాదు.. బాధ్యత. దాన్ని నేను సమర్థంగా తీసుకోగలననే నమ్మకంతో వస్తున్నా. ఈ ఎన్నికలు ఇలా జరగడం పట్ల మేమెవరమూ సంతోషంగా లేం. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం నాన్నకు ఇష్టం లేదు. నాన్న 46ఏళ్ల నట జీవితంలో ఈ స్థాయిలో నటులు విడిపోలేదు. ఇంత బీభత్సంగా ఎన్నికలు జరగలేదు’’ ‘మా’లో మార్పు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరికి మెడికల్‌ ఇన్సురెన్స్‌ కల్పిస్తాం అని విష్ణు అన్నారు.

ఎన్నికల తీరుపై ఎవరూ సంతోషంగా లేరని, ఎన్నికల గురిం‍చి మీడియా, సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధకరమన్నారు. ఇక తన ప్యానల్‌లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. మార్పు తీసుకురాగలననే ధైర్యంతో ఇప్పుడు వస్తున్నా. ‘మా’లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్‌కు ఉంది. ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులు ఉన్నారు. వారిలో కొందరు నా బ్యానర్‌లోనూ పనిచేశారు. ఒక నిర్మాతగా వాళ్లను నా సినిమాలోకి తీసుకుంటా. కానీ మా అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదు అని విష్ణు తెలిపారు.

- Advertisement -