‘ఖిలాడి’ టాకీ పార్ట్ పూర్తి..

24
Ravi Teja

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది.

థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా..అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి
సాంకేతిక బృందం:
కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు
డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్
ఎడిటర్: అమర్ రెడ్డి
లిరిక్స్: శ్రీ మణి
స్టిల్స్: సాయి మాగంటి
మేకప్: ఐ శ్రీనివాసరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి
ప్రొడక్షన్ హెడ్: పూర్ణ కండ్రు
పబ్లిసిటీ: రామ్ పెద్దిటి సుధీర్
కో డైరెక్టర్: పవన్ కేఆర్‌కే
ఆర్ట్: గాంధీ న‌డికుడిక‌ర్‌
పీఆర్ఓ: వంశీ-శేఖర్