మాల్దీవుల్లో మంచు ఫ్యామిలీ..

38
Manchu Lakshmi Family

టాలీవుడ్‌ హీరో మంచు మోహన్‌ బాబు కుటుంబం మాల్దీవుల్లో సేదతీరుతోంది. అక్క‌డి ప్ర‌కృతిని బాగా ఎంజ‌య్ చేస్తున్న ఎప్ప‌టిక‌ప్పుడు వారి టూర్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా త‌న కూతురు నిర్వాణ‌తో క‌లిసి దిగిన ఫొటోస్‌తో పాటు త‌న తండ్రి మోహ‌న్ బాబుతో చేసిన డిన్న‌ర్‌కు సంబంధించిన ఫొటోలను మంచు లక్ష్మి షేర్ చేసింది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

“నిన్న రాత్రి బీచ్ లో విందు ఏర్పాటు చేసి, నాన్నను ఆశ్చర్య పరిచాను. ఈ విందులో అందరమూ భాగమయ్యాం. నాన్న నటించిన సినిమాల్లోని పాటలను వింటూ, సముద్రపు అందాలను చూస్తూ, మాకు ఇష్టమైన భోజనాన్ని స్వీకరించాం. ఇలా మాకోసం మేము కొంత సమయాన్ని గడిపి చాలా రోజులే అయింది. దీంతో ఈ టూర్ నాకెంతో ప్రత్యేకంగా నిలిచింది” అని మంచు లక్ష్మి పేర్కొంది.