ఆసీస్‌ మీడియాపై అశ్విన్ సంచలన కామెంట్స్‌..

94
Ravichandran Ashwin

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ అనంత‌రం రెండు మ్యాచుల్లో గెలిచి స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. టీమిండియాలో సీనియ‌ర్లు లేన‌ప్ప‌టికీ, ఆట‌గాళ్లు గాయాల‌పాలైన‌ప్ప‌కీ యంగ్ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అయితే ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌‌లో భారత జట్టును మాన‌సికంగా దెబ్బ కొట్ట‌డానికి ఆసీస్ అభిమానులతో పాటు మీడియా ప్ర‌య‌త్నించింద‌ని స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ తెలిపాడు.

తాజాగా ఫీల్డింగ్ కోచ్ శ్రీధ‌ర్‌తో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడాడు. మ్యాచ్ జర‌గ‌క‌ముందు బ్రిస్బేన్‌కు రావ‌డానికి టీమిండియా భ‌య‌ప‌డుతోందంటూ ఆస్ట్రేలియా మీడియా చేసిన‌ క‌థ‌నాలపై అశ్విన్ స్పందిస్తూ.. బ్రిస్బేన్ టెస్ట్ చారిత్ర‌క విజ‌యానికి సిడ్నీలోనే తొలి అడుగు ప‌డిందని చెప్పాడు. నాలుగో టెస్టుకు ముందు ఆడిన మ్యాచుల్లో టీమిండియా బాగా రాణించ‌డంతో బ్రిస్బేన్‌లోనూ సంచ‌ల‌న విజయం సాధించిన‌ట్లు తెలిపాడు.