అక్కా అంటే లక్ష్మిబాంబ్‌కు కొపం వచ్చిందట….

124
Manchu Lakshmi comments on akka

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ. నటిగానే కాదు నిర్మాతగానూ, బుల్లితెర యాంకర్ గానూ ఆకట్టుకుంటుంది లక్ష్మీ. మంచు లక్ష్మి సాధారణంగా చాలా సహనంగా ఉంటుంది. సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న లక్ష్మీ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట జారదు. సోషల్ మీడియాలో కూడా చాలా అలర్ట్ గా ఉంటూ ట్వీట్స్‌కు…. రీట్వీట్స్ పెడుతూ ఉంటుంది. మంచువారి అభిమానులు చాలా మంది లక్ష్మి అక్క అని పిలుచుకుంటారు అయితే ఇన్నిరోజులు ఆ పిలుపును సరదగానే తీసుకున్న లక్ష్మీ ఇప్పుడు ఒక్కసారిగా అలా పిలిచినందుకు కొపం వచ్చిందట.

Manchu Lakshmi comments on akka

అక్క అనే పిలుపుతో గత వారాంతంలో తనకు ఒక చేదు అనుభవం ఎదురైందని తన ట్విట్టర్‌లో రాసుకొంచంది మంచు లక్ష్మి. ఈ పిలుపుపై చాలా ఘాటుగానే స్పందించింది… నోటిలో పళ్లు కూడా లేని ముసలాయన అక్కా అని పిలవటం నాకు ఎంతో చిరాకు తెప్పించింది. దీంతో నాపేరును అక్క అని మార్చుకోవాలని ఆలోచిస్తున్నా. అక్క తొక్కా అంటూ తన ట్విట్టర్‌లో రాసుకొంచింది.

Manchu Lakshmi comments on akka

మొత్తం మీద ముసలాయన పిలుపుతో లక్ష్మి చాలా చిరాకు గురైందట. ఇక మంచు వారి అభిమానులు మంచులక్ష్మిని అక్క అని పిలుస్తార లేక పిలవటం మానేస్తార అనేది వేచి చూడాల్సిందే మరి.