చంద్రబాబుకు దర్శకుడు గుణశేఖర్ లేఖ..

268
Rudramadevi
- Advertisement -

టాలీవుడ్ దర్శకనిర్మాత గుణశేఖర్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి బహిరంగ లేఖ రాశారు. గత సంవత్సరం గుణ దర్శకనిర్మాణంలో వచ్చిన రుద్రమదేవీ మూవీకి వినోదపు పన్ను మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. రుద్రమదేవీ మూవీ విడుదల సమయంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వినోదపు పన్ను రాయితీని కల్పించాల్సిందిగా కోరుతూ గుణశేఖర్ విజ్ఞప్తి చేసుకున్నారు. తెలంగాణ సీఎం వెంటనే ట్యాక్స్ మినహాయింపును ప్రకటించగా ఏపీ ప్రభుత్వం మాత్రం పరిశీలిస్తామని చెప్పింది. కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా మొదటగా పేర్కొని అటు తర్వాత అర్థాంతరంగా ఫైలును మూసివేసింది.

Rudramadevi

ఈ నేపథ్యంలో ట్యాక్స్ మినహాయింపు కోరుతూ ఆయన మరోమారు ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్టు చేశారు. ‘గౌతమీపుత్రశాతకర్ణికి వినోదపు పన్నురాయితీ ప్రకటించి, కళలపట్ల, సంస్కృతిపట్ల మీరు చూపే ఆదరాభిమానాలకు సాటి తెలుగుచలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా నాలుగు విడుదలైన చారిత్రాత్మక చిత్రం”రుద్రమదేవి మూవీకి వినోదపుపన్ను రాయితీ కోరుతూ గతంలోనే దరఖాస్తు పూర్వకంగా ఏపీ ప్రభుత్వ దృష్టికి తేవడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వాధికారులు కొంత పురోగతిని చూపి అర్థాంతరంగా ఫైలు మూసివేయడం జరిగిందంటూ తెలియజేశారు. ఆదర్శవంతమైన స్త్రీమూర్తి జీవితగాధగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించాము. ఓ సగటు కళాకారుడిగా ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించి ఆమె చరిత్రకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడం కళామతల్లికి నా వంతు సేవగా భావించాను. అయితే నేనాశించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినోదపుపన్ను రాయితీ ప్రకటించివుంటే నిర్మాతగా నాకు కొంత ఉపశమనం కలిగుండేదని పేర్కోన్నారు.

రాణీరుద్రమదేవి కేవలం తెలంగాణకే పరిమితమైన నాయకురాలు కాదని. దాదాపు దక్షిణాపధమంతటినీ పాలించిన మహారాణి అని. ఆమె పట్టాభిషేక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని మంగళగిరి వద్ద గల ‘మార్కాపురం శాసనంని కూడా, ఇటీవల మీరు కూడా ఒకానొక సభలో ఉదహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో నా దరఖాస్తుని పునఃపరిశీలించి రుద్రమదేవి చిత్రానికి ఆంధ్రప్రదేశ్ లో వసూలు చేసిన వినోదపుపన్ను మొత్తానికి సమానమైన “ప్రోత్సాహక నగదుని అందజేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేస్తుందని ఇదివరకే ఎన్నో సందర్భాల్లో రుజవు చేసినట్లుగానే మరోమారు మీరు మీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూన్నానని లేఖలో పేర్కొన్నారు.

Rudramadevi

- Advertisement -