మల్కాజ్‌గిరి బరిలో మల్లారెడ్డి!

52
- Advertisement -

రాష్ట్రంలో అప్పుడే లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తు దూసుకుపోతోంది.

ఇక అంతా ప్రతిష్టాత్మకంగా చూస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరోసారి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు మల్లారెడ్డి. మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

వాస్తవానికి మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది మల్కాజ్‌గిరి నుండే. తొలి సారి ఎంపీగా పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి తర్వాత మేడ్చల్‌ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇక రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో మరోసారి మేడ్చల్‌ నుండి గెలిచారు. మల్కాజ్‌గిరిలో మల్లారెడ్డికి మంచి పట్టు ఉంది. అంతేగాదు ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. అందుకే ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌ని కోరారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేయడం ఖాయమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Also Read:న‌టి పావ‌ల శ్యామ‌ల‌కు కాదంబ‌రి కిర‌ణ్ సాయం

- Advertisement -