బ్రేకింగ్ న్యూస్ః బీజేపీ లోకి రేవంత్ రెడ్డి….??

392
Revanth Bjp

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.ఇప్పటికే రేవంత్ రెడ్డి బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పని ఖతమైపోవడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. పైగా మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కన్నా..బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది.

పైగా తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు ఢిల్లి పెద్దలు చూస్తున్నారు. 2024 దృష్టి లో పెట్టుకొని తెలంగాణ లో బిజెపి నీ పటిష్టం చేయడానికి కూడా మోడీ ఆలోచిస్తున్నాడు, అదే అదునుగా భావించిన రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కి చెందిన మాజీ తెలంగాణ ఎంపీ (ప్రస్తుతం బిజెపి లో చేరారు) టచ్ లో ఉన్నాడని సమాచారం. అంతే కాకుండా బిజెపి లో చేరి తెలంగాణ తరుపున కేంద్రమంత్రి దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు, రేపో ఎల్లుండో ఢిల్లీ కి పయనం అవుతున్నాడనీ విస్వసనీయవర్గాల సమాచారం..