లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన మల్లారెడ్డి..

227
mp mallareddy
- Advertisement -

తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. 10 మందితో కేబినెట్‌ను విస్తరించనున్న కేసీఆర్ కొత్తవారికి ఛాన్స్ కల్పించారు. అందులో లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుండి టీడీపీ తరపున ఎంపీగా మల్లారెడ్డి ..సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరారు.

2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీలో బరిలోకి నిలిచిన మల్లారెడ్డి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 87,990 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పటినుండి ఆయనకు కేబినెట్‌లో బెర్త్ దక్కుతుందోని ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలకు నిజం చేకూరేలా మల్లారెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.ఆయనకు కీలకమైన విద్యుత్‌ శాఖను అప్పగించనున్నట్లు సమాచారం. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు మల్లారెడ్డి.తన మాటతీరే కాదు కాలేజీ ఫంక్షన్‌లలో గంగ్నమ్ స్టెప్పులేసి దుమ్మురేపారు. ఆయన అల్లుడే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. ఆయన కుటుంబసభ్యులు సైతం పలు విద్యాసంస్థలు స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు.

- Advertisement -