పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ..

128
malkajgiri

మల్కాజిగిరిలోని మౌలాలి లో గతంలో మర్కజ్ కి వెళ్ళి వచ్చిన వారిలో ముగ్గురికి కొరోనా పాజిటివ్‌ని గుర్తించిన అధికారులు మౌలాలి లోని షఫి నగర్ , షాదుల్లా నగర్, జవహర్ నగర్ కాలనీలను రెండు కంటైన్‌మెంట్ జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. కొరోనా వచ్చిన వారి వ్యాధి తగ్గి గాంధి నుంచి డిస్చార్ అవ్వడంతో, ఇంకా ఎవ్వరికి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో మౌలాలి లోని షఫి నగర్, షదుల్లా నగర్ లో కంటైన్మెంట్ జోన్ ని అధికారులు తొలగించారు .

ఈ సందర్భంగా కంటైన్మెంట్ జోన్ లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణి చేసి వారికి కృతగ్యతలు తెలిపారు మల్కాజిగిరి డి.సి.పి రక్షిత మూర్తి .