Congress:మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ కష్టమే!

16
- Advertisement -

మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ పట్టు కోల్పోతుందా ? ఈసారి లోక్ సభ ఎన్నికల్లో అక్కడ గెలవడం కష్టమేనా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు బలం ఉన్న లోక్ సభ స్థానాలలో మల్కాజ్ గిరి ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచినప్పటికి అంతకుముందు 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని విజయం సాధించింది. ఓవరాల్ గా చూస్తే మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ పార్టీకే బలం ఎక్కువ అనేది రాజకీయ వాదులు చెప్పే మాట. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన ఎంపీగా ఉండి మల్కాజ్ గిరిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదనే విమర్శ గట్టిగా వినిపించింది. .

ఫలితంగా రోజురోజుకు అక్కడ పట్టు కోల్పోతూ వచ్చింది హస్తం పార్టీ. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కొడంగల్ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన రేవంత్ రెడ్డి గెలిచి సి‌ఎం పదవి చేపట్టారు. ఇక మల్కాజ్ గిరి విషయంలో ఆయన పాత్ర ఎంటనేది అందరిలోనూ తోలుస్తూ వచ్చిన ప్రశ్న. ఇక లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఇక్కడ ఎవరు నిలబడతారో అనే చర్చ కూడా జరిగింది. ఎవరు ఊహించని విధంగా మల్కాజ్ గిరి ఎంపీ సీటును సునీత మహేందర్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.

అయితే ఆ పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్ కొనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ గెలుపు కష్టమే అని తేలినట్లు సమాచారం. అందుకే పట్టు కోల్పోకుండా ఉండేందుకు హస్తం పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే టార్గెట్ తో హస్తం పార్టీ ఉంది. కానీ మల్కాజ్ గిరి లాంటి బలమైన కాంగ్రెస్ స్థానాల్లో కూడా ప్రతికూల పవనాలు విస్తుండడంతో హస్తం నేతల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. అటు బి‌ఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీలు మల్కాజ్ గిరి లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మరి మల్కాజ్ గిరి లో హస్తం పార్టీ ఎంతవరకు పట్టు నిలుపుకుంటుందో చూడాలి.

Also Read:గసగసాలు ఎక్కువగా వాడుతున్నారా?

- Advertisement -