ప్రజల సహకారంతో కరోనా కట్టడి: ఇంద్రకరణ్

167
ik reddy
- Advertisement -

నిర్మల్ జిల్లాలో ప్రజలందరి సహకారంతో కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగామని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 మాస్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఇంద్రకరణ్..జిల్లాలో కరోనా భారీన పడిన 20 మందిలో 8 మంది పూర్తిగా కొలుకోని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. వారందరిని హోం క్వారంటైన్‌కు తరలించామని వైరస్ నియంత్రణకు డాక్టర్లు, పోలీసులు,రెవెన్యూ సిబ్బంది బాగా పనిచేశారని కొనియాడారు.

లాక్‌డౌన్‌ కాలంలో పేదలు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్‌ బియ్యం, నగదును అందిస్తున్నారన్నారు. ఇదేవిధంగా మే నెలలో కూడా అందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత సఫాయి కర్మచారులకు కూడా రేపటి నుంచి సర్పంచ్‌, వార్డ్‌ మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఆధ్వర్యంలో బియ్యం, నూనె, పప్పు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -