- Advertisement -
సూపర్‌స్టార్ మహేష్ సినిమాలేకాదు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ఏఎంబీ సినిమాస్, హంబుల్ డ్రెసెస్‌లో పార్ట్నర్ అయిన మహేష్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో నిర్మాతగా కూడా మారారు. వీటితో పాటు ఈయన మరో కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి.
అయితే మహేష్ ఇప్పుడు ఏకంగా సౌందర్య సాధన ఉత్పత్తుల రంగంపై దృష్టి సారించాడని తెలుస్తోంది. త్వరలోనే ఎంబీ లోగోతో పెర్ఫ్యూమ్ బ్రాండ్ ని లాంచ్ చేయనున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మహేష్ తదుపరి సినిమా వంశీ పైడిపల్లితో క్యాన్సిల్ చేసుకుని పరశురామ్ కి ఈసారి ఓకే చెప్పాడన్న ప్రచారం సాగుతోంది.
- Advertisement -