తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

415
Petrol price
- Advertisement -

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం దేశవ్యాప్తంగా భారీగా తగ్గాయి. వివిధ నగరాల్లో పెట్రోల్‌పై 24–27 పైసలు, డీజిల్‌పై 25–26 పైసలు తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.71కి పడిపోయింది. డీజిల్‌ ధర రూ.63.26 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రం కావడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో పెట్రో ధరలు పతనవడం గమనార్హం. ధరల తగ్గుదల భారత్‌ లాంటి దేశాలకు శుభవార్తే అని చెప్పాలి.

దీంతో సోమవారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.70.59కి చేరుకుంది. 2019 జూలై తర్వాత ఇదే తక్కువ ధర. డీజిల్‌ ధర కూడా లీటర్‌ రూ.63.26కి పడిపోయింది. దేశీయ చమురు అవసరాల్లో 84 శాతం వరకు భారత్‌ దిగుమతులపైనే ఆధారపడుతోంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.75.04, డీజిల్‌ లీటర్‌ ధర రూ. 68.88గా ఉంది.

- Advertisement -