మహాకూటమి పొత్తు..చిత్తు!

257
TDP Mahakutami
- Advertisement -

రెండు క‌ళ్ల సిద్దాంతం. రెండు ప్రాంతాల్లో రెండు వైఖ‌రులు. మ‌భ్య పెట్టే ప్ర‌య‌త్నం. ఎదురుదాడితో త‌ప్పించుకొనే మార్గం. అధినేతలు కలిశారు కానీ నేతలు, కార్యకర్తల్లో నిరాశ.దీంతో పొత్తు గేమ్ బూమ్ రాంగ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో సీటు ఎవరికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇక ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్,టీడీపీల ఎన్నికల పొత్తు నిప్పు రాజేంది. పొత్తు అనైతికమంటూ టీడీపీ,కాంగ్రెస్ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. శివారు ప్రాంత సీట్లన్ని టీడీపీ అడుగుతుండటంపై ఇరు పార్టీల నేతల్లో అసంతృప్తి నెలకొంది. ముఖ్యనేతలు ఆయా పార్టీలను వీడిచేందుకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై భగ్గుమన్నారు ఉప్పల్ కాంగ్రెస్ నేతలు. ఉప్పల్ కాంగ్రెస్ ఇంఛార్జి బండారి లక్ష్మారెడ్డి,నాచారం కార్పొరేటర్ శాంతి సహా ముఖ్య నాయకులందరూ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకొనున్నారు. ఉప్పల్ సీటు టీడీపీకి కేటాయించడంపై ఆయన నిరాశ చెందారు. లక్ష్మారెడ్డి పార్టీని వీడటం కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బని సీనియర్ నేతలు చెబుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఉప్పల్‌లో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నారు.

వీటితో పాటు ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, కూకట్‌పల్లి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల కోసం టీడీపీ పట్టుబడుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని వలసలు తప్పేలా కనిపించడం లేదు.

- Advertisement -