120 కోట్ల క్లబ్‌లో గీతగోవిందం..

231
Geetha Govindam Box Office Collections
- Advertisement -

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బోల్డ్, ఫుల్ యాటిట్యూడ్, అగ్రెసివ్‌గా నటించిన విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాలో తన నటనా వైవిధ్యాన్ని చూపించాడు. సరదాగా, అమాయకంగా కనిపించే పాత్రలో నటించి అందరిని మెప్పించాడు.

పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా తాజాగా 125 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలై 26 రోజులు గడుస్తున్న కలెక్షన్ల సునామీ మాత్రం ఆగడం లేదు. ఇప్పటివరకు ప్రపంచ వ్యప్తంగా రూ.120 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు స్టార్ హీరోలకే సొంతమైన నైజాం రికార్డులను కూడా బద్దలు కొట్టింది. 19 కోట్ల షేర్‌ను రూ. 34 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది.

Geetha Govindamఇప్పటివరకు అగ్రహీరోలకు మాత్రమే ఈ ఫీట్ సొంతం కాగా తాజాగా చిన్నిసినిమాగా వచ్చిన గీతగోవిందం స్టార్ హీరోల సినిమాలను ధీటుగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -