కమల హాసన్‌కు కోర్టులో ఊరట..

106
Kamal Haasan
- Advertisement -

నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు కోర్టులో ఊరట లభించింది. మ‌హాభార‌తం గురించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసులో కమల్‌పై మ‌దురై కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. 2017లో ఓ ఇంటర్వ్యూలో క‌మ‌ల్ మాట్లాడుతూ… మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌గా అప్పట్లో ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

హిందువుల మ‌నోభావాల‌ను కించ‌ప‌ర్చేలా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశార‌ని, చర్యలు తీసుకోవాలని నెల్‌లై జిల్లా పళైయూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా అప్ప‌టి నుంచి విచార‌ణ కొన‌సాగుతోంది. ఆ పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా కోరుతూ కమల హాసన్ కోర్టును ఆశ్ర‌యించారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి వివాదాస్పద ఘటనలు జరగకుండా చూసుకుంటామని క‌మ‌ల్ త‌ర‌ఫు న్యాయ‌వాది హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కమలహాసన్‌పై కేసును కొట్టి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -