ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేద మందు కాదు- ఆయుష్ కమిషన్

247
- Advertisement -

కరోనాకు ఆనందయ్య ఇస్తున్నది ఆయుర్వేద మందు కాదని, అది నాటువైద్యమని రాష్ట్ర ఆయుష్ శాఖ తెలిపింది. ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు. మందు తయారీలో హానికర పదార్థాలు లేవని రాములు వెల్లడించారు.

కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందున్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని రాములు వెల్లడించారు. దీనిని వాడాలా? వద్దా? అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

కాగా, ఆనందయ్య ఇచ్చే మందులో పచ్చకర్పూరం, పసుపు, నల్ల జీలకర్ర, వేప చిగురు, మారేడు చిగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటి ముడి పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతోపాటు ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో కంట్లో వేస్తున్నారు. కాగా, తన పరిశీలనలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని రాములు తెలిపారు. మరోవైపు, ఆనందయ్య మందును పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు వస్తుందన్న వార్తల్లో నిజం లేదని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -