మహేష్‌కు విలన్‌గా మాధవన్‌..?

31
mahesh

టాలీవుడ్ సూపర్ ‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారిపాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డైరెక్టర్‌ పరశురామ్ దర్శకత్వంలో బ్యాంక్ స్కాముల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ తొలిషెడ్యూలు షూటింగ్ ఆమధ్య దుబాయ్‌లో జరిగింది. ప్రస్తుతం హైదరాబాదులో సెట్స్ లో తదుపరి షూటింగును కొనసాగిస్తున్నారు. ఇక ఈ ‘సర్కారు వారిపాట’ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.

కాగా, ఇందులో విలన్ పాత్రకు మొదటి నుంచీ రకరకాల పేర్లు వినిపించాయి. అయితే, వారిలో ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు మాధవన్‌ను విలన్ గా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. మాధవన్‌తో చిత్రం యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ రానుందట.