టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు..

30
trs

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ వైస్ ఎంపిపి సిహెచ్ కిషన్,తోట గంగాధర్, భూమయ్య, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మధుతో పాటు నర్సయ్య, పెండెం సత్యనారాయణ,రాహుల్ సతీష్ పలువురు ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న రైతు,పేదల సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఇవాళ బాల్కొండ మండలానికి చెందిన వివిధ పార్టీల సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బద్దం ప్రవీణ్ రెడ్డి,సీనియర్ నాయకులు తౌటు గంగాధర్,లింగా గౌడ్,డా.ప్రసాద్ పలువురు పాల్గొన్నారు.