మా ఊరు పేరు భైరవకోన..సందీప్‌ కిషన్‌

51
- Advertisement -

ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవసారి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఊరు పేరు భైరవకోన’ కోసం జతకట్టారు. ఫాంటసీ అడ్వంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తునారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.

సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఇదివరకే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌.. ఈ సినిమా కోసం ఒక ఫాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేశారని సూచించింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మేకర్స్ మొదటి సింగిల్ ‘నిజమే నే చెబుతున్నా’ విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు.

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై చిత్రీకరించిన బ్రీజీ రొమాంటిక్ నంబర్‌ను కంపోజ్ చేశారు శేఖర్ చంద్ర. సిద్ శ్రీరామ్ తన మ్యాజికల్ వాయిస్ తో మరింత ప్రత్యేకంగా ,మంత్రముగ్ధులను చేసాడు. ఇన్స్టెంట్ హిట్‌గా మారిన ఈ ఆహ్లాదకరమైన పాటలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై తన భావాలను వివరిస్తూ కనిపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. అద్భుతమైన కంపోజిషన్, బ్యూటిఫుల్ సింగింగ్, ఆకట్టుకునే సాహిత్యంతో ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలుస్తుంది. సందీప్ కిషన్ డ్యాన్స్‌లు గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. వర్ష బొల్లమ్మ చాలా అందంగా కనిపించింది.

కావ్య థాపర్ మరో కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

Ram Charan: భార్యతో చరణ్ దుబాయి వెకేషన్

‘మంచు’ రియాలిటీ షో

#NBK108…దసరాకి రెడీ..!

- Advertisement -