వెబ్ సిరీస్‌‌గా లూసిఫర్..

118
mohan

కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీల హవా నడుస్తోంది. అగ్రహీరోలు సైతం వెబ్ సిరీస్‌ల బాటపడుతుండటంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇక తాజాగా ఇప్పుడు మలయాళంలో హిట్ కొట్టిన లూసిఫర్ ఇకపై వెబ్ సిరీస్‌గా రానుంది. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోంది.

ఇక మోహన్‌‌లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయనున్నారు. అయితే సినిమాగా కాదు. ఎనిమిది ఎపిసోడ్ల వెబ్‌‌ సిరీస్‌‌గా. ఈ విషయాన్ని స్వయంగా పృథ్విరాజే వెల్లడించారు. ప్రస్తుతానికైతే డిస్కషన్స్ నడుస్తున్నాయని … నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ వస్తే కానీ మిగతా విషయాలపై క్లారిటీ రాదు.