జ్యోతిష్మతి విద్యాసంస్థల మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్

197
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ లో జ్యోతిష్మతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ లోని 42 వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు మరియు అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటారు. అలానే ప్రతి విద్యార్థి వారి ఇంటి వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 6 వేల పైగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు గారు కాలేజ్ ఆవరణలో మొక్కాను నాటి కార్యక్రమంని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, మానవాళికి మొక్కలు ఎంతో అవసరం. మొక్కలు లేకుంటే మనిషి మనుగడ కూడా కష్టమే రానున్న రోజుల్లో. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్ లో ఇలాంటి రాకుండా ఉండాలంటే అందరూ బాధ్యతతో మొక్కలు నాటాలి. అంతేకాదు అవి పెరిగే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గత 4 సంవత్సరాల నుండి గ్రీన్ ఇండియా చల్లేంజ్ ద్వారా చిన్న పెద్ద ధనిక పేద అని తేడా లేకుండా అందరిలో స్ఫూర్తి నింపి అందరితో మొక్కలు నటిస్తున్నారు. అదే స్ఫూర్తితో మా విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి విద్యార్థి ముందుకు వచ్చి ఇందులో పాల్గొనడం వారి సామాజిక బాధ్యతను చూపిస్తుంది. భవిష్యత్ లో కూడా ఇలాంటి మొక్కలు నాటే కార్యక్రమాలు ఎన్నో నిర్బహిస్తాము అని అన్నారు.

ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్స్ డా.జి.లక్ష్మీనారాయణ రావు & డా.పి.కె.వైశాలి గార్లు మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక బాధ్యత ఉండాలని మా చైర్మన్ గారి ఆకాంక్ష. వారి ఆదేశాలను పాటిస్తూ మేము మా విద్యార్థులకు గ్రీన్ ఇండియా చల్లేంజ్ స్పూర్తితో ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ వేల మొక్కలు నాటాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్స్ డా.జి.లక్ష్మీనారాయణ రావు, డా.పి.కె.వైశాలి, గ్రీన్ ఇండియా చల్లేంజ్ సభ్యులు కత్తెరపాక సుధాకర్, హెచ్.ఓ.డి లు, అధ్యాపక బృందం & విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -